బాబును చూస్తే అసహ్యం: చిరు

Chiranjeevi
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును చూస్తే అసహ్యం వేస్తోందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారం కోసం పాకులాడుతున్నారని, దాన్ని చూస్తే అసహ్యం వేస్తోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు గతంలో రాసిన మనసులో మాట పుస్తకంలో రాసిన విషయాలకు, ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకు పొంతన లేదని ఆయన అన్నారు. చంద్రబాబుకు ప్రజలతో సంబంధం లేదని, చంద్రబాబుకు ప్రజల హృదయాలను తాకే మనసు లేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు బుర్రలో పుట్టిన దాని మీదనే ఆధారపడుతారని, ప్రజల మనసులను పసిగట్టి వ్యవహరించే నాయకుడు కారని ఆయన అన్నారు. చంద్రబాబును ప్రజలను విశ్వసించబోరని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెసు వారు సంపాదించుకున్నారని ఆయన ఆరోపించారు. తమకు ప్రజలు అధికారం ఇచ్చే చారిత్రాకావకాశం వచ్చిందని, ప్రజలు దాన్ని వృధా చేసుకోరని ఆయన అన్నారు. తమపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. పార్టీకి బలం, శక్తినిచ్చే వారితో మాట్లాడుతామని, తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోబోనని ఆయన చెప్పారు. తనకు మద్దతిచ్చే వారంతా తన శక్తులేనని ఆయన అన్నారు. తమ పార్టీలో జరిగే వ్యవహారాలను ఎక్కువ చేసి చూపుతున్నారని ఆయన అన్నారు.ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చాక తనను చూస్తారని, తాను ఏం మాట్లాడుతున్నానో చూస్తారని, ప్రజలకు తామే కనిపిస్తున్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+