సినీ పార్టీని నమ్మొద్దు: సిఎం

ప్రజలకు ఏం కావాలో వారు పడుతున్న ఇబ్బందులేమిటో తాము మాత్రమే గ్రహించగలమని అందుకే సామాన్యులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. తాము మడమ తిప్పకుండా అభివృద్ధి సాధించామని ఆయన అన్నారు. ప్రాజెక్టులెన్నో ప్రారంభించామని వాటిని పూర్తి చేయగల సత్తా తమకే ఉందని ఆయన అన్నారు. మహిళలు, రైతులకు ఎన్నో పథకాలు అమలుచేశామని, గుడిసెల్లేని ఆంధ్రప్రదేశ్‌ను తాము మాత్రమే సాధ్యం చేశామని అన్నారు. గన్నవరానికి ఎన్నో పనులు చేశామని ఆయన గుర్తు చేశారు. రాజకీయం అంటే తెలియని సినిమా పార్టీని నమ్మవద్దని కోరారు. అభయహస్తాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications