హైదరాబాద్: రాష్ట్రంలో మహాకూటమి విజయావకాశాలు గణనీయంగా పెరిగాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. కాంగ్రెస్ పై ప్రజల వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని ఆయన మంగళవారం అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నగదు బదిలీ పథకానికి ప్రజలనుంచి మంచి స్పందన ఉందన్నారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొంత ఆలస్యమైనా ఓట్ల బదలాయింపులో ఎలాంటి సమస్యలు తలెత్తవని, ఇదంతా కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారమని అన్నారు.