ఇంటింటికీ కాంగ్రెస్ చికెన్ పంపిణీ
కరీంనగర్: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెసు పార్టీ నాయకులు కొత్త పద్ధతిని ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఇంటింటికీ చికెన్ పంపారు. అర కిలో నుంచి కిలో వరకు కాంగ్రెసు కార్యకర్తలు ఇంటింటికీ చికెన్ సరఫరా చేశారు. బుధవారం ఉదయం నుంచి ఈ సరఫరా కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. జగిత్యాల శాసనసభా నియోజకవర్గం నుంచి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా మంత్రి టి. జీవన్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
దాన్ని గమనించి తెలుగుదేశం పార్టీ నాయకులుపోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి చికెన్ ప్యాకెట్లను పట్టుకుని కేసు నమోదు చేశారు. మద్యం, డబ్బుల పంపిణీపై ఈసారి నిఘా పెరగడంతో కాంగ్రెసు నాయకులు ఈ పద్ధతిని ఎన్నుకున్నట్లు అనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఉద్దేశించిన డబ్బులను, మద్యాన్ని పోలీసులు పెద్ద యెత్తున రాష్ట్రంలో స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications