జార్ఖండ్ లో మావోల దాడిలో 7గురి మృతి
రాంచీ: ఎన్నికల విధుల నిర్వహణకోసం వెళుతున్న భద్రతాసిబ్బంది బస్సుపై మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత మావోయిస్టులు దాడి చేశారు. రాంచీకి 140 కిలోమీటర్ల దూరంలో లతియార్ జిల్లా నిమియదిహ్ గ్రామం క్యాంపునకు వెళ్తుండగా వారి ప్రయాణిస్తున్న బస్సుపై మావోయిస్టులు దాడి చేశారు. బస్సులో 80 మంది ఎన్నికల సిబ్బంది ఉన్నారు. బస్సును దారిలో మావోయిస్టులు డిటొనేటర్లు పెట్టి పేల్చారు. అదే సమయంలో ఎవరూ తప్పించుకోకుండా కాల్పులు కూడా జరిపారు.
భద్రతాసిబ్బంది కూడా ఎదురుకాల్పులు జరిపారు. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా ఓ జవాను ఆసుపత్రి దారిలో మృతి చెందారు. 5గురు మావోయిస్టులు మృతి చెందారు.నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారిని అపోలో అస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications