నాలుక కోసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మహేష్ అనే వ్యక్తి నాలుక కోసుకున్నాడు. హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో గల సత్యసాయి నిగమాగమం ఆలయంలో బుధవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇతను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవాడని, సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేస్తుంటాడని చెబుతున్నారు.
మహేష్ బుధవారం ఉదయం ఆలయానికి వచ్చి తన జేబులో ఉన్న కత్తితో నాలుక కోసుకున్నాడు. రక్తం ధారాపాతంగా కారుతుండడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే విషయాన్ని అక్కడి వారు పోలీసులకు తెలియజేశారు. అతన్ని ఉస్మానియా అస్పత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం ఏమీ లేదని, అయితే మాట్లాడలేకపోతున్నాడని వైద్యులు చెబుతున్నారు. అతనికి శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాగే అతను నాలుక కోసుకున్నాడు. ఈ విషయాలన్నీ అతను రాసి పెట్టుకున్న లేఖలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications