అధికారం మాదే: రాహుల్ ధీమా

Rahul Gandhi
కాకినాడ: కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారం తమదేనని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కాకినాడలో ఆయన గురువారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కాకినాడ లోకసభ సీటు నుంచి కేంద్ర మంత్రి పల్లంరాజు పోటీ చేస్తున్నారు. తమ కుటుంబం పేదల కోసం త్యాగాలు చేసిందని రాహుల్ చెప్పుకున్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించారని ఆయన చెప్పారు. తన తల్లి సోనియా గాంధీ, తాను దేశంలోని పేద పక్షాన ఉన్నామని ఆయన చెప్పారు. తమ కుటుంబాన్ని ఈ దేశ ప్రజలకు, ముఖ్యంగా పేదలు ఎంతో ఆదరిస్తున్నారని, అందుకు తాము రుణ పడి ఉన్నామని ఆయన చెప్పారు.

తమ పార్టీని గెలిపించినప్పుడే రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ పేదల జీవితాలు బాగుపడతాయని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్రాలు సక్రమంగా వినియోగించినప్పుడు పేదలకు మేలు జరుగుతుందని, అలా జరగడం వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించిందని, పేదలకు మేలు జరిగిందని ఆయన చెప్పారు. ఒరిస్సాలో కేంద్ర ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించడం లేదని, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పేదల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు రూపాయల కిలో బియ్యం పథకం, ఆరోగ్య శ్రీ వంటి పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+