తిరుపతి: తొలి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని అనటానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణాలో విజయం తమదేనని చెప్పుకునే ముఖ్యమంత్రి ఇప్పుడు వారికి వ్యతిరేకంగా మాట్లాడటం గమనార్హమని అన్నారు.
కాంగ్రెస్ ఓటమికి ప్రజారాజ్యం గెలుపునకు అధి సూచిక అని ఆయన అన్నారు. చిరంజీవి విజయంకోసం ఆయన శుక్రవారం తిరుపతిలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి కరుణాకరరెడ్డి తమ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యం చేయిస్తున్నారని ఆరోపించారు.