రామ్ చరణ్ కేం తెలుసు: అల్లు

Allu Aravind
హైదరాబాద్: ప్రజారాజ్యం జాబితాలో 14 మంది బోగస్‌ బీసీలు ఉన్నారని రామ్‌ చరణ్‌ తేజ్‌ వ్యాఖ్యానించడానే మాటలతో ప్రజారాజ్యం ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ విభేదించారు. తమ అభ్యర్థుల్లో కేవలం 14 మంది డబ్బున్న వాళ్లు మాత్రమే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు తనకు సమాచారం ఉందన్నారు. చరణ్‌ను ప్రచారానికి పంపించలేదని, తనకున్న రాజకీయ పరిణతి ఏమిటని ప్రశ్నించారు. విలేకరి ఏం ప్రశ్న అడిగారు? ఆయన చెప్పిన సమాధానం ఏమిటి అన్నది చూడాలని సూచించారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఇలాంటి వాటికి పాల్పడే అవసరం, అవకాశం ఎవరికి ఉందో అందరికీ తెలుసన్నారు. పాతికేళ్లుగా రాజకీయం ఎవరి చేతుల్లోకీ వెళ్లకుండా వైఎస్‌, చంద్రబాబులు ఇద్దరూ పంచుకున్నారన్నారు. అధికారం మూడో వ్యక్తికి వెళ్తోందంటే ఇద్దరూ ఏకమవుతారని అన్నారు. ఏకమైనా, కుమ్మక్కైనా వారిద్దరికే అవకాశం ఉందని అరవింద్‌ చెప్పారు.

తొలివిడత జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోరు జరిగిందని ఆయన అన్నారు. ఉత్తర కోస్తా మూడు జిలాల్లో తమ పార్టీకి ఎదురే లేదని చెప్పారు. తెలంగాణలో తెరాస, వామపక్షాల కవచాన్ని అడ్డం పెట్టుకున్న తెలుగుదేశం గొప్పగా యుద్ధం చేశామని అనుకుంటోందని ఆయన అన్నారు. అందుకే ఇంచుమించు ఓట్లన్నీ తమకే పడ్డాయని, అధిక స్థానాలు గెలుస్తున్నామని ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు. తెరాస, వామపక్ష కవచాల ప్రభావం లేని మలియుద్ధం ముందుందని ప్రకటించారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి కనీసం యుద్ధం చేసే అవకాశం కూడా లేదని వ్యాఖ్యానించారు. రెండో విడత ఎన్నికలైన తర్వాతే ఎన్నిసీట్లు వస్తాయనేది మాట్లాడతానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

పాలకొల్లు ప్రజలు చిరంజీవిని పెద్ద కొడుకుగా చూసుకుంటారని అరవింద్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. అల్లుడికి కేవలం భోజనం పెట్టి పంపించండంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అరవింద్‌ స్పందించారు. తిన్న తర్వాత వెన్నుపోటు పొడిచి వెళ్లాల్సిన అవసరం చిరంజీవికి లేదంటూ పరోక్షంగా బాబును ఎద్దేవా చేశారు. భోజనం పెట్టడమే కాకుండా ఊళ్లో ఉన్న 90 శాతం ఓట్లు తమ అల్లుడికే వేస్తారన్నారు. తిరుపతి, పాలకొల్లుల్లో ఏ స్థానాన్ని వదులుకోవాలనే విషయమై కనీసం ఆలోచన కూడా చేయలేదని చెప్పారు. చిరంజీవి తిరుపతిని వదులుకుంటారంటూ అక్కడ, పాలకొల్లును వదులుకుంటారంటూ ఇక్కడ చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడే అవకాశం లేదని, ప్రజారాజ్యం పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజారాజ్యంపై కాపు సంఘాల విమర్శలను విలేకరులు ప్రస్తావించగా, కాపులను దరి చేరనివ్వట్లేదని కొందరు, ఇది కాపుల పార్టీ అని మరికొందరు వ్యాఖ్యానించారని, తామేంటన్నది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. చిరంజీవిని పార్టీ పెట్టమని ఎవరైనా బొట్టుపెట్టి పిలిచారా? అంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అనకాపల్లి ప్రజలు ఇష్టపడుతున్నారని అక్కడ తిరిగినప్పుడు అనిపించిందని, అందుకే అక్కడ ఎంచుకున్నానని తెలిపారు. పరకాల ప్రభాకర్‌ ఆరోపణలు ముగిసిన అధ్యాయమని చెప్పారు. చిరంజీవి చిన్న కూతుర్ని, అల్లుడిని ఎన్నికల ప్రచారానికి పిలవలేదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+