వైఎస్ ను అరెస్ట్ చేయాలి: నాయిని
హైదరాబాద్: ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాల చిచ్చు పెడుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖరరెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని తెరాస నేత నాయని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. వై.ఎస్ తెలంగాణాకు వ్యతిరేకి అని తాము మొదటినుంచీ చెబుతున్నామని, ఇప్పుడు ఆయన తన మనసులో మాట బయటపెట్టారని అన్నారు. సోనియాగాంధీ, జాతీయకాంగ్రెస్ కమిటీ తెలంగాణాకు అనుకూలంగా ఉన్నా వై.ఎస్ పూటకో రకంగా మాట్లాడటం సరికాదన్నారు. బాధ్యత గలిగిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యతారహితంగా మాట్లాడటం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications