తెలంగాణ: వైయస్ పై కాకా

Venkataswamy
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా నిర్ణయం జరిగిపోయిందని కాంగ్రెసు సీనియర్ నేత జి.వెంకటస్వామి అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రజల మధ్య కొట్లాట పెట్టేలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని అన్నారు. భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని, అయితే ప్రజలు నిర్ణయం తీసేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి మనసులో ఉన్న మాటలు ఇప్పుడు బయటికొచ్చాయని అన్నారు. రాష్ట్రంలో అవినీతి తీవ్రస్థాయిలో ఉందని మండిపడ్డారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా, చివరకు రాహుల్‌ గాంధీ సభల్లో కూడా రూ.2కే కిలో బియ్యం ఇస్తే చాలదని జనం అంటున్నారని చెప్పారు.

వైఎస్‌ తలచుకుంటే రేపే తెలంగాణ వస్తుందని ఏడాదిగా నేను చెబుతూనే ఉన్నానని, తెలంగాణ వస్తే కష్టాలు పాలవుతామని రానివ్వలేదని ఆయన అన్నారు. పార్టీ ఒప్పుకొన్న తర్వాత, కోర్‌ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా తెలంగాణ అంశాన్ని ఇక్కడ దాకా లాక్కొచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఏదో ఆశలో ఉన్నారని, వారినిప్పుడు మొత్తానికే ముంచేసినట్లయిందని ఆయన అన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆయన చేసింది కాదని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాతపూర్వకంగా ఇచ్చి మాట్లాడాలని చెప్పారని వెంకటస్వామి అన్నారు. అధిష్టానం రాసిచ్చింది సీఎం చదివారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+