వైయస్ కల్లు తాగిన కోతి: బాబు
ఒంగోలు: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కల్లు తాగిన కోతిలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కల్లు తాగిన కోతికి ముల్లు గుచ్చుకుందని, దాంతో వైస్ చిందులేస్తున్నారని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన ఆదివారం ప్రచారం నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి ఓడిపోతామనే భయంతో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. తాము మాట మీద నిలబడుతామని ఆయన చెప్పారు. తాము ఇచ్చిన హామీ మేరకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేసి తీరుతామని ఆయన చెప్పారు. వైయస్ అవినీతిపై కోర్టులో విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications