అన్న దంచి కొట్టిండు.. కెరీర్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు..
కష్టపడుతూ ఉంటే విజయం ఏదో ఒకరోజు వస్తుంది అనడానికి నిదర్శనమే అక్కినేని అఖిల్ 'లెనిన్' మూవీ.. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ. 61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అఖిల్ లెనిన్ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 5 కోట్ల 50 లక్షల షేర్ వసూలు చేసింది. అలాగే మూడో రోజున రూ. 6 కోట్ల 62 లక్షల షేర్ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా లెనిన్ మూవీకి రూ. 40 కోట్ల గ్రాస్ వసూళ్లు, రూ. 22 కోట్ల షేర్ వచ్చింది. మౌత్ టాక్ తోనే ఈ మూవీ దూసుకెళ్తోంది.
ఇదే రేంజ్ లో విధ్వంసం కొనసాగితే లెనిన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల కలెక్షన్స్ మరో రెండు మూడు రోజుల్లోనే అందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే లెనిన్ మూవీ అక్కినేని అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వసూళ్ల పరంగా కూడా కెరీర్ బెస్ట్ ఫెర్మామెన్స్ చేస్తోంది. దాంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. మనోడు హిట్టు కొట్టాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక లెనిన్ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈయన తొలి సినిమా వినరో భాగ్యము విష్ణు కథ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ అయింది. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం హీరోగా చేశాడు.

ఇప్పుడు అఖిల్ తో లెనిన్ రూపంలో సాలిడ్ హిట్ అందుకున్నారు. లెనిన్ మూవీలో అఖిల్ కు జోడీగా అందాల తార భాగ్యశ్రీ భోర్సే నటించారు. అలాగే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. చిత్రంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. సినిమాటోగ్రాఫర్ గా జార్జ్. సి విలియమ్స్ ప్రతిభ కనపరిచారు. ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా లెనిన్ మూవీని నిర్మించాయి. ఈ సినిమా తర్వాత అక్కినేని అఖిల్ చేయబోయే సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.












Click it and Unblock the Notifications