మలి విడతకు పక్కా ఏర్పాట్లు: ఇసి
హైదరాబాద్: రేపు మలి విడత ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. ఈసారి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. మలి దశ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 4311 ఉండగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు 2222 ఉన్నాయి. మలివిడతలో 410 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉండగా 2993 వివాదాస్పద కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.
వీటి పర్యవేక్షణకు 24 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించామని సుబ్బారావు తెలిపారు. లక్షా 18 వేలమంది పోలీసులను, 766 స్త్ట్రెకింగ్ ఫోర్సులను, 305 స్పెషల్ స్త్ట్రెకింగ్ ఫోర్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా పర్యవేక్షణ జరుపుతామని తెలిపారు.












Click it and Unblock the Notifications