ఎన్టీఆర్ అమ్ముడు పోయారు
తణుకు: తన తాతకు చేసిన అవమానాన్ని దిగమింగి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చే సొమ్ము కోసం అమ్ముడుబోయిన జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ నేతలు రాసిన స్క్రిప్టు చదువుతున్నారని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తణుకులో కాంగ్రెస్ అభ్యర్ధి తరపున ప్రచారం కోసం వ్చిచన ఆయన స్దానిక మీడియాతో మాట్లాడుతూ తాతకు వెన్నుపోటు పొడిచిన మామను జూనియర్ ఎన్టీఆర్ పొగడటం విడ్డూరంగా ఉందన్నారు. జూనియర్ మాటలు వింటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. అలాగే మార్పు తెస్తామంటూ కొత్తగా పెట్ిటన పార్టీ సమాజంలో ఏ మార్పు తీసుకు రాలేకపోయిందని, దీనిని సోదరులంతా గమనించాలని కోరారు. మార్పు కోసం కొత్త పార్టీకి ఓటేస్తే దుష్ట టీడీపికి మేలు జరిగే అవకాసముందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications