చిరంజీవికి భద్రత పెంచాలి: పీఆర్పీ

తిరుపతి ఘటనపై ప్రజారాజ్యం అగ్రనేతలు అల్లుఅరవింద్, దేవేందర్‌గౌడ్ రాష్ట్ర డీజీపీ మహంతిని కలిశారు. జిల్లా ఎస్పీని తక్షణమే బదిలీ చేయాలని, చిరంజీవికి భద్రత పెంచాలని వారు డీజీపీని కోరారు. ఓ పార్టీ అధినేతగా ఉన్న చిరంజీవి గదులను తనిఖీ చేయడం చాలా అమానుషం అని దేవేందర్‌గౌడ్ అన్నారు. తిరుపతిలో జరిగిన ఘటనలను సమిక్షించి తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు.
తిరుపతిలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి బస చేస్తున్న హోటల్ ముందు జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు వివరణ కోరారు. దీనిపై నివేదిక సమర్పించాలని ఈసీ వారిని ఆదేశించింది. తిరుపతిలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ను, ఎస్పీలను సుబ్బారావు ఆదేశించారు. తిరుపతిలో కాంగ్రెస్‌కు వత్తాసు పలుకుతున్న పోలీసులను, అధికారులను అక్కడి నుంచి బదిలీ చేయాలని పీఆర్పీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications