పరారీలో జెసి బ్రదర్
అనంతపురం: తాడిపత్రిలో శుక్రవారం జరిగిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది, తెలుగుదేశంపార్టీకి చెందిన 11 మంది కార్యకర్తలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి దివాకరరెడ్డి సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన వారిని అనంత కోర్టుకు తరలించగా మే 8 వరకు రిమాండ్ విధించినట్లు తెలియవచ్చింది.
ఇరు వర్గాలకు చెందిన నాయకుల ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసమైనాయి. పరస్పర కేసులు నమోదు చేసుకున్నారు. శుక్రవారం టిడిపి నాయకుడు నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి మళ్ళీ విడుదల చేశారు. ప్రభాకరరెడ్డి పరారీలో ఉండడం...ఒక్కరినే అరెస్డు చేస్తే మళ్ళీ ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉన్నందున నాగిరెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి ప్రశాతం.












Click it and Unblock the Notifications