ఖత్రోచీపై రెడ్ కార్నర్ నోటీసు రద్దు

ఖత్రోచీపై రెడ్ కార్నర్ నోటీసును కొనసాగించడంలో అర్థం లేదని, ఆ నోటీసును ఉపసంహరించుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉందని అటార్నీ జనరల్ మిలన్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. నోటీసు ఉపసంహరించుకోవడానికి కారణమేమిటనే విషయంపై మాట్లాడడానికి సిబిఐ డైరెక్టర్ అశ్వినీ కుమార్ నిరాకరించారు. భారతదేశంలో వెలుగు చూసిన కుంభకోణాల్లో బోఫోర్స్ చాలా పెద్దది. ఈ కుంభకోణం 1980 దశకంలో వెలుగు చూసింది. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీతో పాటు పలువురు బోఫోర్స్ వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications