కసబ్ మైనర్ కాడు: నివేదిక

కసబ్ కు డాక్టర్లు ఒసిఫికేషన్ పరీక్షలు నిర్వహించారు. తన వయస్సు 21 ఏళ్లని కసబ్ స్వయంగా చెప్పినట్లు నిర్ధారించడానికి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇద్దరు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. మొదటి సాక్షి నాయర్ ఆస్పత్రిలో కసబ్ కు చికిత్స చేసిన డాక్టర్ రాఘవన్. కసబ్ తన వయస్సు 21 అని పట్టుబడిన వెంటనే చికిత్స చేసిన సమయంలో తనతో చెప్పినట్లు రాఘవన్ వెల్లడించారు. రెండో సాక్షి ఆర్థర్ రోడ్ జైలు జైలర్. కసబ్ జైలుకు వచ్చిన సమయంలో తన వయస్సు 21 ఏళ్లు అని చెప్పినట్లు జైలర్ వెల్లడించాడు. దాడులు జరిగిన సమయంలో కసబ్ వయస్సు 17 ఏళ్లు మాత్రమేనని, అతను మైనర్ అయినందున అతన్ని జ్యువెనైల్ కోర్టులో విచారించాలని కసబ్ తరఫు న్యాయవాది అబ్బాస్ కజ్మీ వాదించారు. దీంతో కోర్టు కసబ్ వయస్సు నిర్దారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications