నివేదిక: గాయాలతో బోర్గే మృతి

బోర్గేది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు చెప్పారు. బోర్గేది ఆత్మహత్యేనని ముంబయి జాయింట్ పోలీసు కమీషనర్ రాకేష్ మారియా, అదనపు డిజిపి (రైల్వే పోలీసు) కెపి రఘువంశి మంగళవారం చెప్పారు. బోర్దే మృతదేహం వద్ద పోలీసులకు ఆయన రాసి పెట్టిన లేఖ లభ్యమైంది. కొంత మంది రిలయన్స్ ఉద్యోగులు తనను ప్రశ్నించడానికి వచ్చారని ఆ లేఖలో రాసి ఉంది. అంతకు మించి వివరాలు లేవు.
ఆ లేఖపై తేదీ లేదు. మరాఠీలో రాసి ఉంది. పోలీసు ఇన్స్ పెక్టర్ బోభాడేను ఉద్దేశించి ఆ లేఖ రాశారు. తాను తప్పేమీ చేయలేదని ఆ లేఖలో రాశాడు. అంబానీ హెలికాప్టర్ గియర్ బాక్స్ లో గులకరాళ్లు, బురద వేసి ఉండడాన్ని మొదటిసారి బోర్గే గుర్తించాడు. దాంతో అనిల్ అంబానీ ప్రాణాలకు ముప్పు తప్పింది.












Click it and Unblock the Notifications