'రాజీవ్ హత్యకు ప్రభాకరన్ కుట్ర'

రాజీవ్ ను చంపేందుకు ఎవరికీ తెలియకుండా కుట్ర చేసినట్లు అతను చెప్పాడు. దానికి సంబంధించి క్లూ తమకు లేదని, తమను ఎవరిని కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా ప్రభాకరన్, పొట్టు అమ్మన్ ఆ కుట్ర చేశారని అతను చెప్పాడు. ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా రాజీవ్ గాంధీని 1991 మే 21వ తేదీన ఎల్టిటీఇ ఆత్మాహుతి బాంబర్ హత్య చేసిన విషయం తెలిసిందే. శ్రీలంకలో శాంతి బలగాలను మోహరించినందుకు భారత నాయకులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభాకరన్ ఆలోచిస్తూ ఉండేవాడని అతను చెప్పాడు.
హింసకు స్వస్తి చెప్పాలని, సంప్రదింపులకు సిద్ధం కావాలని సూచిస్తూ తాను ప్రభాకరన్ కు ఒకసారి లేఖ ఇచ్చానని, ప్రభాకరన్ తన లేఖను చించేయడమే కాకుండా తనను అవమానించాడని కరుణ చెప్పాడు. ప్రభాకరన్ సహాయ నిరాకరణ వల్ల నార్వే మధ్యవర్తిత్వంతో శ్రీలంక ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడం తనను ఎంతగానో బాధించిందని అతను చెప్పాడు. తమిళ టైగర్ల సిద్ధాంతకర్త అంటోన్ బాలసింఘం సంప్రదింపులకు సుముఖత వ్యక్తం చేశారని, అయితే ప్రభాకరన్ ప్రతిఘటించాడని అతను చెప్పాడు.
కరుణ డిప్యూటీ నేత పిల్లయన్ తో విభేదాల వల్ల పార్టీని వీడి తమిళ్ మక్కల్ విదుతలై పులిగళ్ ను ఏర్పాటు చేశాడు. శ్రీలంక ఫ్రీడం పార్టీలో చేరి దానికి ఉపాధ్యక్షుడు అయ్యాడు. ఆయనను ఇటీవలే మహిందా రాజపక్సే తన మంత్రివర్గంలోకి తీసుకున్నాడు.












Click it and Unblock the Notifications