ఖత్రోచి కేసు: గడువు కోరిన సిబిఐ
న్యూఢిల్లీ: బోఫర్స్ కేసు నిందితుడు ఖత్రోచి కేసు విచారణను ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 8తేదీకి వాయిదావేసింది. ఖత్రోచిపై సమగ్ర నివేదికను సమర్పించేందుకు సీబీఐ రెండు నెలల గడువు కోరింది. అర్జెంటీనాలో ఉన్న ఖత్రోచీని విచారించలేకపోయామని తెలిపింది. అతనిపై ఉన్న నోటీసును ఉప సంహరించిన విషయాన్ని కూడా తెలిపింది. సీబీఐ వాదన అనంతరం ఢిల్లీ మెట్రో పాలిటన్ కోర్టు ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
బోఫోర్సు కేసులోని ఎనిమిది మంది నిందితుల్లో ముగ్గురు ఇప్పటికే మరణించారని, నలుగురిని ఢిల్లీ హైకోర్టు 2004 ఫిబ్రవరిలో నిర్దోషులుగా విడుదల చేసిందని, ఖత్రోచీని భారత్ కు రప్పించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని ఎసిజి కోర్టుకు చెప్పారు.












Click it and Unblock the Notifications