సోనియా, అద్వానీలపై తీర్పు నేడే

సోనియా గాంధీ మరోసారి పోటీ చేస్తున్న రాయబరేలీ నియోజకవర్గంలో గురువారం పోలింగ్ ప్రారంభమైంది. బిజెపి నేత ఎల్ కె అద్వానీ గాంధీనగర్ నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. జెడియు నేత శరద్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రియా దత్, కర్ణాటక ముఖ్యమంత్రి బంగారప్ప, కేంద్ర మంత్రులు శ్రీప్రకాష్ జైస్వాల్, జోతిరాదిత్య, నటుడు, రాజకీయ నాయకుడు అంబరీష్ మూడో దశ పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు.
గుజరాత్ లోని 26 లోకసభ స్థానాలకు గురువారం పోలింగ్ ముగుస్తుంది. మధ్యప్రదేశ్ లోని 16, ఉత్తరప్రదేశ్ లోని 15, పశ్చిమ బెంగాల్ లోని 14, బీహార్, కర్ణాటకల్లోని 11 చొప్పున, మహారాష్ట్రలో 10 లోకసభ స్థానాలకు, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, దాద్రా, నగర్ హవేలీ, డామన్ డయ్యూల్లో ఒక్కటేసి స్థానాలకు గురువారం పోలింగ్ ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications