చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి అధిక జ్వరంతో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం ఆయనను ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కరుణానిధి వయసు 85 సంవత్సరాలు. కరుణానిధి తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని డిఎంకె వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో ఆయన నడుముకు పెద్ద శస్త్రచికిత్స జరిగింది. లోక్ సభ ఎన్నికల కోసం ఆయన తమిళనాడు అంతటా తిరిగి ప్రచారం చేశారు.