కలుషిత నీరు తాగి 5 గురు మృతి
హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్‌లో డివిజన్ భోలక్ పూర్‌లో గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ సరఫరాచేసిన తాగునీటిని తాగిన ఐదుగురు మరణించగా రెండువందలమంది అస్వస్థతకు గురయ్యారు. ప్రతిరోజు లాగానే నీటిని తాగిన ప్రజలకు వాంతులు, విరేచనాలు ప్రారంభంకావడంతో గాంధీ ఆసుపత్రికి చేరిన వీరికి ప్రాధమికచికిత్స నిర్వహించి ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు.
సమాచారం అందుకొని పరామర్శించేందుకు వచ్చిన జలమండలి అధికారులను బాధితులు నిలదీశారు. రాజకీయ నాయకులను కూడా జనం ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications