ఇదే జానారెడ్డి రికార్డు

ఈ సందర్భంగా ..వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టడం తథ్యమన్నారు. అలాగే తమ పార్టీకి అన్ని సీట్లు వస్తాయని, ఇన్ని వస్తాయని లెక్కలు చెప్పే కంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సీట్లు తాము గెలుచుకుంటామని ధీమాగా చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి రేసులో తాను లేనే లేనన్నారు. మీడియా సృష్టించే కథనాలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ ఉండగా మరొకరు ముఖ్యమంత్రి అవుతారన్న అంశమే రాదన్నారు. వచ్చే ప్రభుత్వంలో తనకు హోం మంత్రి పదవిలో మాత్రం కొనసాగకపోవచ్చని జానా చెప్పారు. హోంమంత్రిగా తాను పూర్తి సంతృప్తిగా పనిచేసినట్లు చెప్పుకున్నారు.
అలాగే ఎన్నికల సందర్భంగా క్రితం సారి కంటే ఈ సారి హింస బాగా తగ్గిపోయిందన్నారు. ఎన్నికల సందర్భంగా కేవలం ఒకే ఒక వ్యక్తి మరణించడం తమ ప్రభుత్వం సాధించిన ఘనత అన్నారు. గత ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసకు ప్రస్తుత ఎన్నికలలో చోటు చేసుకున్న హింసకు మధ్య గల తేడాను ఆయన వివరించారు. ఎన్నికల సందర్భంగా ఒక్క మావోయిస్టు సంఘటనా చోటుచేసుకోకపోవడం తమ ప్రభుత్వం సాధించిన విజయం అన్నారు. ఎన్నికల అనంతరం అనంతపురంలో టిడిపి నాయకుడు అమరా కేశవయ్య హత్యతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని జానా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications