త్వరలో భారత్ తో చర్చలు: పాక్
వాషింగ్టన్ : భారత్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ దేశంతో శాంతి చర్చలు ప్రారంభిస్తామని అమెరికాలో పర్యటిస్తున్న పాక్ అధ్యక్షుడు అసిఫ్ జర్దారీ తెలిపారు. భారత్‌తో యుద్దాన్ని తాము కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యదేశాలు ఎప్పటికీ యుద్దానికి దిగవని ఆయన అన్నారు. భారత్‌తో శాంతియుతంగా ఉండటమే కాకుండా ద్వైపాక్షిక వాణిజ్యానికి తాము సిద్దంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications