సీఈసీ నవీన్‌చావ్లా ఓటు గల్లంతు!
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలు సాక్షాత్తూ కేంద్ర్ ఎన్నికల ప్రధాన కమిషనర్ నవీన్ చావ్లాను సైతం గందరగోళపరిచాయి. ఓటు హక్కు వినియోగించేందుకు ఢిల్లీలోని వీఐపీ పోలింగ్‌కేంద్రం నిర్మాణ్‌భవన్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన నేరుగా పోలింగ్ బూత్ 85 లోకి ఓటేసేందుకు వెళ్లారు. అక్కడ ఓటర్ల లిస్టులో చావ్లా పేరు తొలగించి ఉంది. ఈ వార్త కాస్తా మీడియాకు చేరడంతో కలకలం రేగింది. అయితే ఇటీవల చావ్లా ఇంటిని మార్చడంతో చిరునామా కూడా మారింది. దీంతో ఆయన ఓటు పోలింగ్‌బూత్ 85లో కాకుండా బూత్ 86లో నమోదు అయింది. ఇది కూడా నిర్మాణ్‌భవన్‌లోనే ఉండటంతో అక్కడ చావ్లా ఓటు హక్కును వినియోగించుకొని వెళ్లారు.












Click it and Unblock the Notifications