న్యూఢిల్లీ: నాలుగో విడత పోలింగ్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఉపరాష్టప్రతి అన్సారీలు ఢిల్లీ నిర్మాణ్ భవన్‌లో ఓటుహక్కు వినియోగించుకోన్నారు. కాంగ్రెస్ యువ నేత ప్రియాంకాగాంధీ తన భర్త రాబర్ట్ వద్రాతో కలిసి స్థానిక విద్యాభవన్ మహావిద్యాలయ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో 7 స్థానాలను గెలుచుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే ఢిల్లీలో ఈ రోజే దాదాపు 15 వేల పెళ్లిలు ఉండటంతో ఈ ప్రభావం ఓటింగ్ సరళిపై పడుతున్నట్లు కనబడుతోంది