కష్టపడే వారికే గుర్తింపు: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: కష్టపడి పని చేసే కార్యకర్తలకే పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల సమీక్షా సమావేశంలో ఆయన శనివారంనాడు మాట్లాడారు. మిగతా పార్టీల్లో కష్టపడే వారు ఒకరైతే, ఫలితం అనుభవించే వారు మరొకరు అవుతారని, తమ పార్టీలో అలా ఉండదని, కష్టపడే వారికే గుర్తింపు ఉంటుందని ఆయన చెప్పారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో చాలా బాగా పని చేశారని ఆయన ప్రశంసించారు.

చాలా తక్కువ సమయం ఉన్నా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగా పని చేశారని ఆయన అన్నారు. ఈ జిల్లాల్లో సమస్యలుంటాయని అనుకున్నామని, అయితే అలాంటి సమస్యలేవీ తలెత్తకుండా సమన్వయంతో పని చేశారని ఆయన అన్నారు. వాస్తవాలు అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గాలవారీగా పార్టీ సమీక్షా సమావేశాలు శనివారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఈ నెల 14వ తేదీ వరకు జరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+