ఎన్నారై స్త్రీకి స్వైన్ ఫ్లూ లేదు
హైదరాబాద్: హైదరాబాద్ వచ్చిన ఎన్నారై యువతికి స్వైన్ ఫ్లూ వ్యాధి లేదని వైద్యులు నిర్ధారించారు. అమెరికా నుంచి హైదరాబాదుకు వచ్చిన ఒక ఎన్నారై యువతికి స్వైన్ ఫ్లూ సోకినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఆమెను హైదరాబాదులోని ఎర్రగడ్డలో గల చెస్ట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ యువతిని కేంద్ర ఆరోగ్య మంత్రి పనబాక లక్ష్మి కూడా సందర్శించారు.
అమెరికా నుంచి ఆ యువతికి స్వైన్ ఫ్లూ లేదని వైద్యులు నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి భయం హైదరాబాదు ప్రజలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది.












Click it and Unblock the Notifications