హైదరాబాదులో కలరా మహమ్మారి
హైదరాబాద్: హైదరాబాదులో కలరా మహమ్మారి వ్యాపిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఫీవర్ ఆస్పత్రిలో చేరిన రోగుల రక్తం నమూనాలను వైద్యులు పరీక్షలకు పంపినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని ఫీవర్ ఆస్పత్రిలో 40 మంది రోగులు చేరగా వారిలో 16 మందికి కలరా వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అయితే రోగులను డిశ్చార్జీ చేసినట్లు, వారి చిరునామాల కోసం అన్వేషిస్తున్నట్లు ఆరోగ్య కార్యదర్శి సుబ్రహ్మణ్యం చెప్పారు.
కలరా సోకినవారిలో 11 మంది హైదరాబాదులోని బోలక్ పూర్ నివాసులు కాగా ఒక వ్యక్తి మౌలాలికి చెందినవాడని తెలుస్తోంది. దీంతో బోలక్ పూర్ ప్రజలను పరీక్షించడానికి ఒక వైద్య బృందం అక్కడికి వెళ్లింది. మరో వైద్య బృందం ఫీవర్ అస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తోంది. బోలక్ పూర్ లోని హోటళ్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications