హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలి
ఆదిలాబాద్:రాష్ట్రంలో సత్వరమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఏజెన్సీలో గిరిజనులు కలుషిత నీరు తాగి కలరాతో మృత్యువాత పడుతున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పట్టించుకోవడంలేదని దత్తాత్రే య ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలో ఆయన పర్యటించి, రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖకు ముగ్గురు మంత్రులు ఉన్నా ఏజెన్సీని ప ట్టించుకోవడంలేదన్నారు.
గిరిజనుల సమస్యలను గవర్నర్ దృ ష్టికి తీసుకెళతానని చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు ఇన్‌చార్జిగా మంత్రి రోశయ్యనే వ్యవహరిస్తున్నారని దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. అంతేగాక ఈ ఎన్నికలలో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ రాదని హంగ్ ప్రభుత్వమే ఏర్పడుతుందని దత్తాత్రేయ జోస్యం చె ప్పారు. ప్రభుత్వ ఏర్పాటులో తామే కీలక పాత్ర పోషిస్తామన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications