ఎన్డీయే ర్యాలీలో కేసీఆర్
లూథియానా : పంజాబ్‌లోని లూథియానాలో ఎన్డీయే ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ర్యాలీ ప్రారంభమయింది. ఈ ర్యాలీకి టీఆర్‌ఎస్ అధినేత కే.చంద్రశేఖరరావు హాజరు అయ్యారు. ర్యాలీలో ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడర్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, పంజాబ్‌ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్, అజిత్‌సింగ్, శరద్‌యాదవ్, ఓంప్రకాశ్ చౌతాలా తదితరులు పాల్గొన్నారు. అయితే ర్యాలీలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ నేతల చిత్రాల సరసన కేసీఆర్ ఫోటోను ఉంచారు.ఇక ఎన్డీయేను వీడేది లేదని బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యు) నేత నితీష్‌కుమార్ స్పష్టం చేశారు. లెఫ్ట్ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అతిపెద్ద కూటమిగా అవతరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications