అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు మంగళవారం ఇద్దరు ప్రభుత్వాధికారుల ఇళ్లపై దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై వీరి నివాసాలపై దాడులు చేశారు. విశాఖ జిల్లా యలమంచిలి సీఐ మల్ల మహేష్, శ్రీకాకుళం వాణిజ్య పన్నుల శాఖ అధికారి పురుషోత్తమ నాయుడు ఇళ్లపై ఏసీబీ సోదాలు నిర్వహించింది.
మల్లు మహేష్ బంధువుల ఇళ్లపై కూడా ఎసిబి దాడులు చేశారు. ఆయన నివాసంలో 20 పత్రాలు, నాలుగు బ్యాంక్ అకౌంట్లు దొరికాయి. పురుషోత్తమనాయుడికి 30 లక్షల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. కాగా, కరీంనగర్ జిల్లా చొప్పదండి సిఐ విజయ్ కుమార్ ను ఎసిబి అధికారులు 20 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications