జగన్ 'సాక్షి' సిబ్బంది ధర్నా
హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఎదుట 'సాక్షి' దినపత్రిక ఉద్యోగులు మంగళవారం ధర్నా చేశారు. పోలీసులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమకేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని వారు ఆరోపించారు. జగన్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన జర్నలిస్టులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు బలవంతంగా అక్కడినుంచి తరలించారు.
గుంటూరు జిల్లా నర్సారావు పేటలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ జగన్ పై కేసు నమోదైంది. కోడ్ ను ఉల్లంఘించి రోడ్ షోలు నిర్వహించినందుకు ఈ కేసు నమోదైంది. ఈ కేసులో జగన్ కు మెజిస్ట్రేట్ జగన్ పై అరెస్టు వారంట్ జారీ చేశారు.












Click it and Unblock the Notifications