నేను చెప్పిందే అవుతుంది: కెసిఆర్

ఎన్ డీఏకు మద్దతివ్వడాన్ని కేసీఆర్ సమర్థించుకున్నారు. వామపక్షాలు తమకు బద్ధవ్యతిరేకి అయిన కాంగ్రెస్‌తో కలిసినప్పుడు, తాము ఎన్‌డీఏతో కలిస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మూడో కూటమిని ఊహలపల్లకిగా ఆయన అభివర్ణించారు. దానికి ఇంతవరకూ ఒక రూపమే రాలేదన్నారు. ఆదివారం లూధియానాలో జరిగిన ఎన్ డీఏ బహిరంగసభలో పాల్గొని ఢిల్లీకొచ్చిన కేసీఆర్ మంగళవారం బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు, అద్వానీ రాజకీయ సలహాదారు సుధీంద్ర కులకర్ణిలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆయన మంగళవారం ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్ సింగ్‌తో కూడా అరగంట పాటు సమావేశం అయ్యారు. మొదట తన ఇంటికొచ్చిన సుధీంద్రకులకర్ణితో మాట్లాడిన తర్వాత వెంకయ్యనాయుడి ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వెంకయ్యతో జరిపిన భేటీ సందర్భంగా కేసీఆర్ వెంట ఆయన మేనల్లుడు హరీశ్‌రావ్ మాత్రమే ఉన్నారు. లూధియానా సభలోని అంశాలపై తాము మాట్లాడుకున్నట్లు కేసీఆర్, వెంకయ్య విలేకరులతో చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఎన్‌డీఏలోకి తీసుకొస్తారా? అన్న ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పలేదు.
తెలంగాణ సాధనకోసం కేసీఆర్ ఎన్ డీఏకు మద్దతు పలకడాన్ని వెంకయ్య ప్రశంసించారు. కేసీఆర్‌ది మంచి నిర్ణయమని ఆయన అన్నారు.. ''తెలంగాణ ఏర్పాటు లక్ష్యంతో తెరాస ఏర్పడిందని, వారిని కాంగ్రెస్ మోసం చేసిందని, వారి లక్ష్యం ఎన్ డీఏతో సాకారమవుతుందని తెలుసుకొని మంచి నిర్ణయం తీసుకున్నారని వెంకయ్య అన్నారు. యూపీఏ నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతుంటే తమ కూటమిలోకి కొత్తగా ఐఎన్‌ఎల్‌డీ, ఎజీపీ, ఆర్ ఎల్ డీ, గూర్ఖాఫ్రంట్, తెరాస వచ్చాయని గుర్తు చేశారు. మరికొందరు చేరే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications