న్యూఢిల్లీ: తాను మామూలుగానే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశానని జెడి ఎస్ నేత కుమార స్వామి స్పష్టం చేశారు. తాము యుపిఎలో చేరడం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిదులతో చెప్పారు. కర్ణాటక రాజకీయాల గురించి తాను సోనియాతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తాము తృతీయ ఫ్రంట్ తోనే ఉంటామని కూడా ఆయన చెప్పారు. తాము తృతీయ కూటమితోనే ఉంటామని కుమార స్వామి తండ్రి హెచ్ డి దేవెగౌడ కూడా చెప్పారు.
కుమారస్వామి మంగళవారం రాత్రి సోనియా గాంధీ నివాసానికి వచ్చారు. మీడియా కంట పడకుండా ముసుగు వేసుకుని ఆయన సోనియా నివాసంలోకి చేరుకున్నారు. దీంతో జెడిఎస్ తృతీయ కూటమి నుంచి వైదొలగి యుపిఎలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి.