బాబు స్కీంపై పురంధేశ్వరి ఫిర్యాదు

Purandeswari
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన నగదు బదిలీ పథకం ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి, కాంగ్రెసు నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ మంగళవారం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ నవీన్‌ చావ్లాకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె ఒక వినతి పత్రాన్ని అందజేశారు. నగదు బదిలీని ప్రకటించడం ఓటర్లను డబ్బులతో ఆకర్షించడమే అవుతుందన్నారు. డబ్బుతో ఓట్లను కొన్న నేరం వర్తిస్తుందని చెప్పారు. సబ్సిడీలు ఇవ్వడానికి నేరుగా నగదు ఇస్తామని ప్రలోభ పెట్టడానికి చాలా తేడా ఉందని, భారత ఎన్నికల చట్టం కింద ఇది అక్రమ చర్య అవుతుందని అన్నారు. దీన్ని నోటుకు ఓటు వ్యూహంగా పరిగణించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని అయిదో విభాగం ఎనిమిదవ ఛాప్టర్‌లో అంశాలను పురంధేశ్వరి ప్రస్తావించారు. అందులో ఒక అభ్యర్థి పెట్టడానికి అనుమతించిన ఖర్చు పరిమితిని ప్రస్తావించారు.

బ్రెజిల్‌లో ఈ పథకాన్ని ప్రపంచబ్యాంకు ప్రారంభించిందని గుర్తు చేశారు. పిల్లలను బడికి పంపడం, పిల్లలకు అంటువ్యాధులు రాకుండా సమయానికి టీకాలు వేయించడం తదితర నిబంధనలతో ఈ పథకాన్ని పెట్టారని తెలిపారు. ఇప్పటికే భారత్‌ లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలను బడికిపంపే తల్లిదండ్రులకు ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ఏడాది ఆదాయం 78 వేల కోట్లు ఉంటే, ఈ పథకాన్ని అమలు చేయడానికి రూ.36 వేల కోట్లు ఖర్చవుతుందని వివరించారు. తెలుగుదేశం చెబుతున్నట్లుగా అయినా 18 వేల కోట్లు భారీ మొత్తమని అన్నారు. ఎలా సాధ్యమో తెలుగుదేశాన్ని వివరణ అడగాలని, దాన్నిబట్టి ప్రజా ప్రాతినిధ్య చట్టం వర్తిస్తుందో లేదో పరిశీలించాలని పురంధేశ్వరి ఎన్నికల సంఘానికి సూచించారు. ఏటీఎం నుంచి మహిళ డబ్బులు తీసుకుంటున్నట్లు ఫొటోలతో పత్రికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన భారీ ప్రకటనల క్లిప్పింగులను పురంధేశ్వరి తన వినతిపత్రానికి జత చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+