వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు మాతోనే: కారత్

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో కాంగ్రెసేతర, బిజెపియేతర మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటుకు ప్రధాన కారకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడేనని, చంద్రబాబుతో తాను రోజూ మాట్లాడుతూనే ఉన్నానని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ వెల్లడించారు. చంద్రబాబు ఎన్డీఏలోకి వెళ్లే అవకాశాలున్నట్లు వస్తున్న వార్తల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చంద్రబాబు తమతోనే ఉంటారని స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలపై చర్చించడానికి ఈనెల 18న కాంగ్రెసేతర, బిజెపియేతర పక్షాల నేతలంతా సమావేశం కాబోతున్నట్లు కారత్‌ వెల్లడించారు. చంద్రబాబు స్వయంగా కోరడంవల్లే తాను ఈ ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు.

ఈ నెల 18వ తేదీ సమావేశానికి వామపక్షాలు, బీఎస్పీ, తెలుగుదేశం, ఏఐఏడీఎంకే, బిజూదళ్‌, జేడీఎస్‌ హాజరవుతున్నాయని తెలిపారు. ఫలితాల అనంతర రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి 17న వామపక్షాలు సమావేశమవుతున్నట్లు తెలిపారు. 18న తమపార్టీ పొలిట్‌బ్యూరో, 19న కేంద్ర కమిటీ సమావేశాలుంటాయన్నారు. దేవెగౌడ తనయుడు కుమారస్వామి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలిసిన నేపథ్యంలో ఆ పార్టీకూడా 18న జరిగే సమావేశానికి వస్తుందా అని ప్రశ్నిస్తే ఎందుకు రాదని కారత్‌ ఎదురుప్రశ్న వేశారు. దేవెగౌడ తన పార్టీ విధానం గురించి స్పష్టంగా చెప్పారని, అంతకంటే ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు. తెరాస రాకపోవచ్చని, వాళ్లు వేరే చోటు చూసుకున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2004లో మాదిరి వామపక్షాలు కాంగ్రెస్‌ కు మద్దతు పలుకుతాయా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని, భవిష్యత్తు కార్యాచరణ అన్ని పార్టీలతో కలిసి నిర్ణయిస్తామని వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X