చుక్కల పల్లకిలో నెలవంక రాజసం! ఈ రాత్రికే అద్భుత ఘట్టం

ఖగోళ ప్రియులకు, ప్రకృతి ప్రేమికులకు ఈ వారం ఒక అపురూపమైన కనుల పండుగ ఎదురుచూస్తోంది. మనకు అత్యంత సుపరిచితమైన, చందమామ అందాల 'నెలవంక'.. రాత్రి ఆకాశంలో తళతళలాడే ఇద్దరు రాకుమారుల లాంటి శుక్ర, గురు గ్రహాలతో జతకట్టబోతోంది. మే 18 నుంచి 20, 2026 మధ్య పశ్చిమ సాయంకాల ఆకాశంలో ఈ మూడు ఖగోళ అందాలు కలిసి ఒక ప్రకాశవంతమైన, అరుదైన త్రికోణాన్ని (Triangle) ఆవిష్కరించనున్నాయి. ఈ అద్భుత దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకాశ వీక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమైంది.

ఈ ఖగోళ వింతలో అసలైన ఆకర్షణ, ఎలివేషన్ అంతా ఆ నింగిలోని 'నెలవంక'దే (Crescent Moon). దట్టమైన చీకట్లలో సన్నని రేఖలా, ఎంతో ముచ్చటగా కనిపించే నెలవంక.. ఈ మూడు రోజులు శుక్రుడు, గురు గ్రహాలకు అత్యంత సమీపంలోకి రానుంది. రాత్రి ఆకాశంలో చంద్రుని తర్వాత అంతటి కాంతితో మెరిసేది శుక్రుడే. తనపై ఉన్న దట్టమైన మేఘాల వల్ల సూర్యరశ్మిని ప్రతిబింబిస్తూ 'సాయంత్రపు తార'గా శుక్రుడు తూర్పు పడమరలను ఏలుతుంటే, తన భారీ పరిమాణంతో గురు గ్రహం (Jupiter) భూమికి ఎంతో దూరంలో ఉన్నా సరే గంభీరమైన వెలుగుతో రారాజులా కనిపిస్తాడు. ఈ ఇద్దరు కాంతి వీరుల మధ్య నడిచి వస్తున్న నెలవంక అందం ఆకాశానికి కొత్త కాంతులను అద్దనుంది.

Rare Celestial View Crescent Moon Venus And Jupiter To Form A Bright Triangle In The Night Sky Tonight

ఎప్పుడు చూడాలి? ఎలా చూడాలి?

ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి మీకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు, టెలిస్కోపులు అవసరం లేదు. కేవలం మీ సాధారణ కంటితోనే దీనిని స్పష్టంగా చూడవచ్చు. సూర్యాస్తమయం అయిన తర్వాత 30 నుంచి 60 నిమిషాల వ్యవధిలో, అంటే చీకటి పడుతున్న తరుణంలో పశ్చిమ ఆకాశం వైపు చూస్తే ఈ ముక్కోణపు వింత దర్శనమిస్తుంది. మేఘాలు లేని స్వచ్ఛమైన ఆకాశం, పశ్చిమ దిశ స్పష్టంగా కనిపించే ప్రాంతం అయితే మీ వీక్షణ అనుభవం మరింత అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బైనాక్యులర్‌లు ఉంటే, నెలవంక వంపులను, గ్రహాల కాంతిని ఇంకాస్త లోతుగా ఆస్వాదించవచ్చు.

ఇలాంటి 'మే' మళ్లీ ఎన్నేళ్లకో.. ఆకాశంలో అద్భుతాలు. డోంట్ మిస్
ఇలాంటి 'మే' మళ్లీ ఎన్నేళ్లకో.. ఆకాశంలో అద్భుతాలు. డోంట్ మిస్

మీ టైమ్ జోన్ ప్రకారం చూడాల్సిన సమయాలివే:

ఈ అరుదైన "గ్రహ కలయిక" (Planetary Conjunction) ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒకేసారి సాక్షాత్కరించనుంది.

  • భారతదేశంలో (IST): సాయంత్రం 7:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల మధ్య.
  • అమెరికాలో (EDT): రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల మధ్య.

భారతదేశం, అమెరికాతో పాటు యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లోని ప్రజలందరికీ ఈ సాయంకాలపు త్రికోణం స్పష్టంగా కనిపించనుంది.

ఈ రాత్రికి ఆకాశంలో.. నెలవంక చుట్టూ మూడు గ్రహాల విన్యాసం
ఈ రాత్రికి ఆకాశంలో.. నెలవంక చుట్టూ మూడు గ్రహాల విన్యాసం

ఈ మే నెల కలయిక ఎందుకు ప్రత్యేకం?

ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. ఇలాంటి ప్రకాశవంతమైన గ్రహాల సమూహాలు ప్రతి నెలా రావు. రాబోయే జూన్ 2026లో శుక్రుడు, గురు గ్రహాలు మరింత దగ్గరగా రానున్నాయి. అయితే, ఆ సమయానికి చంద్రుడు వీటికి దూరంగా జరుగుతాడు. కాబట్టి, ముచ్చటైన నెలవంకతో కూడిన ఈ మే నెల త్రికోణ కలయిక అత్యంత అరుదైనది, ప్రత్యేకమైనది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మూడు రోజులు సాయంత్రం కాగానే మీ ఇంటి డాబా పైకో లేదా ఖాళీ ప్రదేశానికో వెళ్లి.. ఆకాశంలో నెలవంక చేస్తున్న ఆ వింతల విందును చూసి తరించండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+