గ్రంథ చౌర్యం చిక్కుల్లో నితీష్

నితీష్ రాసిన 80 పేజీల పుస్తకం స్పెషల్ కెటగిరీ స్టేటస్ - ఎ కేస్ ఫర్ బీహార్ పై స్థానిక పత్రికలు గత కొద్ది రోజులుగా విస్తృతంగా వార్తలు రాశాయి. పరిశోధక విద్యార్థి ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. తాను రాసిన పరిశోధనా పత్రానికి నితీష్ కుమార్ పుస్తకం కాపీ అని తెలుసుకుని దిగ్ర్భాంతికి గురయ్యానని, తన గ్రంథాన్ని నితీష్ కుమార్ కాపీ కొడతారని తాను ఊహించలేకపోయానని అతుల్ కుమార్ అన్నాడు. తాను తన పరిశోధనా పత్రాన్ని ఆసియా అభివృద్ధి పరిశోధనా సంస్థకు సమర్పించినట్లు, దాన్ని అక్కడి నుంచే నితీష్ దొంగిలించారని సింగ్ అంటున్నాడు.
నితీష్ కుమార్ అసియా అభివృద్ధి పరిశోధనా సంస్థ తెచ్చిన పుస్తకాన్ని ఎండార్స్ చేస్తున్నారని, ఆ గ్రంధాన్ని నితీష్ రాయలేదని ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. అతుల్ సింగ్ బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లాకు చెందినవాడు. అతను 2004 ఎన్నికల్లో చాప్రా లోకసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు.












Click it and Unblock the Notifications