కావ్యపాప కొంపముంచిన పాక్ స్పిన్నర్: నమ్ముకుంటే ఇచ్చిపడేశాడుగా!
The Hundred League 2026: ది హండ్రెడ్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే కావ్య మారన్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ లీడ్స్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఎంఐ లండన్ జట్టుతో జరిగిన ఈ ఆరంభ పోరులో సన్‌రైజర్స్ లీడ్స్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న ఎంఐ లండన్ జట్టును ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 99 బంతుల్లో 143 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్యఛేదనలో ఎంఐ లండన్ జట్టు కేవలం 84 బంతుల్లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎంఐ లండన్ కెప్టెన్ సామ్ కరణ్ 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా.. నికోలస్ పూరన్ 22 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టుకు 16 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు.
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్
ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టుకు ఓపెనర్లు మిచెల్ మార్ష్(41 పరుగులు), ర్యాన్ రికెల్టన్(25 పరుగులు) మంచి ఆరంభాన్ని అందించారు. దీని తర్వాత హ్యారీ బ్రూక్ కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా జాక్ క్రౌలీ 11 బంతుల్లో 29 పరుగులు చేశాడు. టామ్ ఆల్సాప్ 18 బంతుల్లో 31 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టును 143 పరుగులకు చేర్చాడు. ఎంఐ లండన్ తరఫున రిచర్డ్ గ్లీసన్ 19 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్‌కు 2 వికెట్లు, రషీద్ ఖాన్‌కు ఒక వికెట్ లభించాయి.

కాపాడిన నికోలస్ పూరన్, సామ్ కరన్
144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, ఎంఐ లండన్ పేలవమైన ఆరంభాన్ని అందుకుంది. విల్ జాక్స్ కేవలం 2 పరుగులకే ఔటవ్వగా.. జేమ్స్ విన్స్ పరుగులేమీ చేయకుండానే నిష్క్రమించాడు. ఆ తర్వాత సామ్ కరన్, నికోలస్ పూరన్ సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ వారు ఓ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి, 16 బంతులు మిగిలి ఉండగానే తమ జట్టుకు విజయాన్ని అందించారు.
పాక్ స్పిన్నర్‌ను చితక్కొట్టిన నికోలస్ పూరన్
ఈ మ్యాచ్ లో కావ్యమారన్ జట్టు తరఫున పాకిస్థానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ అరంగేట్రం చేశాడు. అయితే అబ్రార్ అహ్మద్ అరంగేట్రం అతనికి ఏ మాత్రం కలిసిరాలేదు. ఇంతలో 70 బంతుల తర్వాత బౌలింగ్‌కు వచ్చిన అబ్రార్ అహ్మద్ ఒకే ఓవర్‌లో 3 సిక్సర్లు సమర్పించుకున్నాడు. సామ్ కరన్ మొదటి బంతిని మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్‌గా బాదాడు. ఆ తర్వాత 74వ, 75వ బంతులకు నికోలస్ పూరన్ వరుసగా రెండు సిక్సర్లు, ఒకటి స్ట్రెయిట్‌గా, మరొకటి డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌కు, బాది విజయాన్ని ఖాయం చేశాడు. పూరన్ 19 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని, 84వ బంతికి ఎంఐ లండన్‌కు 7 వికెట్ల విజయాన్ని ఖాయం చేశాడు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు హాజరైన టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా వీరి హిట్టింగ్‌ను ఎంతో ఆస్వాదించాడు.
Lord's ➡️ The Oval
— Star Sports (@StarSportsIndia) July 21, 2026
The Hitman is in attendance for the season opener! 😍#TheHundred 2026 👉 MI London vs Sunrisers Leeds | LIVE NOW! pic.twitter.com/5I9xYzOxrz












Click it and Unblock the Notifications