1986 తర్వాత మళ్లీ ఇప్పుడే.. 40 ఏళ్ల కనిష్ఠానికి యెన్

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో ఊహించని సంచలనం నమోదైంది. జపాన్ కరెన్సీ అయిన 'యెన్' విలువ ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఏకంగా 163.24 మార్కుకు పడిపోయి, దాదాపు 40 ఏళ్ల నాటి కనిష్ఠ స్థాయికి చేరుకుంది. 1986 తర్వాత జపాన్ కరెన్సీ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా ఖజానా బాండ్ల ఈల్డ్‌లు పుంజుకోవడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Yen Drops To Lowest Level In Nearly 40 Years As Rising Oil Prices And US Bond Yields Boost Dollar

డాలర్‌కు పెరిగిన ఆదరణ.. జపాన్ ఆందోళన!

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ నెలకొన్న అనిశ్చితి కారణంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే అమెరికా డాలర్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మరోవైపు, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 91.99 డాలర్లకు చేరుకోవడంతో పాటు, అమెరికా లాంగ్ టర్మ్ బాండ్ ఈల్డ్‌లు 5 శాతాన్ని దాటడం ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. దాంతో యూరో, బ్రిటిష్ పౌండ్, ఆస్ట్రేలియన్ డాలర్ వంటి ప్రధాన కరెన్సీలన్నీ ఒత్తిడికి లోనవ్వగా, జపాన్ యెన్ మాత్రం దారుణంగా దెబ్బతింది.

రంగంలోకి బ్యాంక్ ఆఫ్ జపాన్?

ఇప్పటికే డాలర్‌తో యెన్ మారకం విలువ 160 దాటిన సమయంలో.. గత ఏప్రిల్, మే నెలల్లో.. జపాన్ ప్రభుత్వం చరిత్రలోనే అత్యధిక మొత్తంలో విదేశీ మారక నిల్వలను ఖర్చు చేసి రికార్డు స్థాయిలో జోక్యం చేసుకుంది. అయితే ఆ ఊరట తాత్కాలికమే అయింది. కరెన్సీ విలువ మళ్లీ 163 దాటడంతో, జపాన్ ఆర్థిక శాఖ మళ్లీ మార్కెట్‌లోకి దిగి సొంత కరెన్సీని కొనుగోలు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు జపాన్ మరోసారి వేల కోట్ల డాలర్లు వెచ్చించి ఊహించని రీతిలో ఎంట్రీ ఇవ్వవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+