తెరాసతోనూ కలుస్తాం: అరవింద్

Allu Aravind
హైదరాబాద్‌: ఎన్నికల అనంతర పొత్తులకు రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఉండవని, తాము కూడా అంతేనని ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ అన్నారు. పొత్తులకు తలుపులు మూయలేదని, ఇంకా తెరిచే ఉన్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెరాస కూడా మీవైపు వస్తానంటే ఆహ్వానిస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించగా తప్పకుండా అని జవాబిచ్చారు. ఎన్నికల ఫలితాల్ని సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా అంచనా వేయటంలో టీవీ ఛానెళ్లు ప్రతిసారీ వాస్తవానికి దూరంగా ఉంటున్నాయని అరవింద్‌ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో కేంద్రంలో ఎన్‌డీఏ వస్తుందని ప్రకటించాయని, కానీ ఫలితాలు వేరే విధంగా వచ్చాయి కదా అని ప్రశ్నించారు.

ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను కాపాడుకొనేందుకు ప్రజారాజ్యం పార్టీ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసింది. ఇందుకోసం హైదరాబాద్‌ సమీపంలోని శామీర్‌పేట వద్ద కొన్ని రిసార్ట్‌ లను బుక్‌ చేసింది. శనివారం రాత్రి 10.30 గంటలకు శాసనసభ పక్షనేతగా చిరంజీవిని ఎన్నుకున్న వెంటనే ఆయనతో సహా ఎమ్మెల్యేలంతా ప్రత్యేక బందోబస్తుతో రిసార్ట్స్‌కి బయలుదేరి వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+