జూ.ఎన్టీఆర్ కు లక్ష్మీపార్వతి శాపాలు
హైదరాబాద్: ఎన్టీఆర్ ఆత్మఘోష వల్లనే జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయిందని లక్ష్మీపార్వతి శాపనార్ధాలు పెట్టారు. ఎన్టీఆర్ ఆరడుగుల ఆజానుబాహుడని, జూనియర్ ఎన్టీఆర్ ఆయన భుజాల వరకు కూడా రాడని ఆమె అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడితో కుమ్మక్కైన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల కారణంగా ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలగడం లేదని గతంలోను లక్ష్మీపార్వతి విమర్శించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్ పాలన ఉందంటూ లక్ష్మీపార్వతి ప్రశంసించారు. ఎ ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించినా వైఎస్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. బసవరామతారకం ట్రస్టు విషయంలొ లక్ష్మీపార్వతికి, బాలకృష్ణకు మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. లీగల్ గా లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ భార్యకాదని బాలకృష్ణ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications