ముంబయి: యుపిఎ తిరిగి అధికారంలోకి రావడంతో స్టాక్ మార్కెట్ సోమవారం ఉరకలెత్తింది. ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషంలోనే సెనెక్స్, నిఫ్టీ అప్పర్ సర్క్యూట్ ను తాకి చరిత్ర సృష్టించింది. దాంతో ట్రేడింగ్ ను 11 గంటల 55 నిమిషాల వరకు నిలిపేశారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ ఛేంజి సెనెక్స్ 1,305.97 పాయింట్లకు చేరుకుంది. నిప్టీ 600 పాయింట్లు పెరిగింది. అన్ని సెక్టార్ల ఇండెక్స్ లు పెరిగాయి. సెనెక్స్ పది శాతం అప్పర్ సర్క్యూట్ చేరుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి.