యుపిఎ చైర్ పర్సన్ గా సోనియా

ప్రభుత్వ ఏర్పాటుపై యుపిఎ భాగస్వామ్య పక్షాలు చర్చించాయి. ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ లభించిన తర్వాత యుపిఎ సమావేశం కావడం ఇదే మొదటి సారి. మంత్రివర్గంలో తమకు లభించే మంత్రి పదవుల సంఖ్యపై, అప్పగించే శాఖలపై కాంగ్రెసు మిత్రపక్షాలు ఈ సమావేశంలో మాట్లాడినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వానికి కనీస ఉమ్మడి కార్యక్రమం ఉండాలని కూడా ఆ పక్షాలు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.
ఈ సమావేశానికి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లతో పాటు ఎఐసిసి ప్రధాన కార్యదర్సి రాహుల్ గాంధీ, విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, డిఎంకె నేత ఎం.కరుణానిధి, ఎన్సీపి నేతలు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, మమతా బెనర్జీ, ముస్లిం లీగ్ నాయకుడు ఇ.అహమద్, జెఎంఎం నేత శిబూ సోరేన్ హాజరయ్యారు.
మన్మోహన్ మంత్రివర్గం ఈ నెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు పొత్తులు కుదుర్చుకున్న పార్టీలతో పాటు కొత్త పార్టీలు యుపిఎకు మద్దతు తెలియజేస్తున్నాయి. ఎస్పీ, బిఎస్పీ, జెడి (ఎస్) వంటి పార్టీలు బేషరతుగా మద్దతు తెలిపాయి. దీంతో యుపిఎకు మద్దతిస్తున్న లోకసభ సభ్యుల సంఖ్య 316కు చేరుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 272 సభ్యుల మద్దతు సరిపోతుంది.












Click it and Unblock the Notifications