రేపు 5.30కి మన్మోహన్ ప్రమాణం

Manmohan Singh
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రి పదవులపై మిత్రపక్షాలతో చర్చలు రేపటి లోగా ఒక్క కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. దీంతో మన్మోహన్ తో పాటు ఆయన మంత్రి వర్గ సభ్యులు కూడా రేపు ప్రమాణం చేస్తారని చెబుతున్నారు. మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో జరుగుతుంది.

76 ఏళ్ల ఆర్థిక శాస్త్రవేత్త ప్రధాని పదవిని చేపట్టడం ఇది రెండో సారి. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను కలిసి మంత్రులుగా ప్రమాణం చేసే సభ్యుల పేర్లను సమర్పిస్తారు. గురువారం ఉదయమే ఆయన రాష్ట్రపతిని కలవాల్సింది. అయితే మిత్రపక్షాలతో ముఖ్యంగా డిఎంకెతో మంత్రి పదవులపై ఒప్పందం కుదరకపోవడంతో ఆ భేటీ వాయిదా పడింది. మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. యుపిఎకు 322 సభ్యుల బలం ఉంది. యుపిఎకు తగిన మెజారిటీ ఉండడంతో పార్లమెంటు విశ్వాసం పొందాలని రాష్ట్రపతి ప్రధానిని ఆదేశించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+