ప్రమాణ స్వీకారానికి డిఎంకె డుమ్మా

డిఎంకెతో ఏర్పడిన ప్రతిష్టంభనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో శుక్రవారం తెల్లవారు జామున చర్చలు జరిపారు. డిఎంకె చర్చలు కొనసాగించాలని వారు నిర్ణయించుకున్నారు. గురువారం అర్థరాత్రి సమయంలో కూడా మన్మోహన్ సింగ్ కరుణానిధితో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఉండడంతో టిఆర్ బాలు, ఎ. రాజాలను మంత్రివర్గంలో చేర్చుకోవడానికి కాంగ్రెసు ఇష్టపడడం లేదు. అయితే వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని కరుణానిధి పట్టుబడుతున్నారు. మన్మోహన్ సింగ్ శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications